జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ను సన్మానించిన మాజీ కార్పొరేటర్ మరుపళ్ళ రవి
అండర్ రైల్వే గేటు ప్రాంతంలోని కరీమాబాద్ లో గల న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కోడం సబిత కు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించడం ఆనందదాయకమని 40 డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి అభిప్రాయపడ్డారు.
పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ అభినందన కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్ కోడం శ్రీధర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మరుపల్ల రవి అవార్డు గ్రహీతను శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు . ఈసందర్భంగా కరస్పాండెంట్ శ్రీధర్ మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాలుగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ పాఠశాల ఉన్నతికి పాటుపడి ఎందరో విద్యార్థినీ విద్యార్థులకు మార్గదర్శకురాలిగా నిలిచిన ప్రధానోపాధ్యాయురాలు కోడం సబిత కు జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం ఎంతో సంతోషాన్నిచ్చిందని అన్నారు.
మరుపళ్ళ రవి మాట్లాడుతూ కరీమాబాద్ ప్రాంతంలో ఎన్నో పాఠశాలలు ఉన్నప్పటికి న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హై స్కూల్ కు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. శ్రీధర్ మరియు సబిత లు నిరంతరం పాఠశాల పర్యవేక్షణలో ' విద్యార్థినీ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు అందుబాటులో ఉంటూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి సహకరిస్తారని అన్నారు చక్కని ప్రతిభ క్రమశిక్షణ యుత బోధన ఆహ్లాదకరమైన వాతావరణము తల్లి లాంటి శిక్షణా తండ్రి లాంటి రక్షణ అన్నివేళలా ఈ పాఠశాలలో అందుబాటులో ఉంటాయని అన్నారు ..కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.