శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు – రౌడీ షీటర్లకు నల్గొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి హెచ్చరిక..
నల్గొండ: నల్గొండ పట్టణంతో పాటు సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారని నల్గొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి తెలిపారు.
రాబోయే వినాయక నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో నల్గొండ సబ్ డివిజన్ పరిధిలోని రౌడీ షీటర్లకు బుధవారం సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్గొండ టౌన్ పరిధిలోని 75 మంది రౌడీ షీటర్లతో పాటు సబ్ డివిజన్ పరిధిలోని మొత్తం 150 మంది రౌడీ షీటర్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, గతంలో నేరాలకు పాల్పడిన వారు తమ నేర ప్రవృత్తిని పూర్తిగా విడిచిపెట్టి, ఇకపై ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా సాధారణ పౌరులుగా ప్రశాంతంగా జీవించాలని సూచించారు.
వినాయక ఉత్సవాల సమయంలో ఎలాంటి గొడవలు, అల్లర్లు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, గొడవల్లో జోక్యం చేసుకున్నా లేదా నేరాలకు పాల్పడినా పీడీ యాక్ట్ (PD Act)తో పాటు కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రౌడీ షీటర్ల కదలికలపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతారని, వారి ప్రవర్తనను ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని తెలిపారు. నేరాలకు దూరంగా ఉంటూ మంచి మార్గంలో నడుచుకుని కుటుంబంతో కలిసి గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని సూచించారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏ చర్యనైనా పోలీసులు సహించబోరని డీఎస్పీ కె. శివరాం రెడ్డి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ ఆదిరెడ్డి, ఎస్‌ఐలు సైదాబాబు, శివప్రసాద్, ముత్తయ్య, పోలీస్ సిబ్బంది షకీల్, శంకర్, అంజయ్య, బాలకోటి తదితరులు పాల్గొన్నారు.