బాధ్యతాయుత పాత్రికేయతతో సమాజానికి మేలు* *మౌలానా మాసూమ్ సాఖిబ్ ఖాస్మీతో ‘అప్నా వరంగల్ డాట్ కామ్’ఎడిటర్ ప్రత్యేక భేటీ
ప్రముఖ ఇస్లామిక్ పండితుడు,ముఫ్తీ సయ్యద్ మాసూమ్ సాఖిబ్ ఖాస్మీ దామత్ బరకాతుహుమ్‌ను‘అప్నా వరంగల్ డాట్ కామ్’ఎడిటర్ మిర్జా ఫతేహుల్లా బేగ్ రియాజ్ బుధవారం ప్రత్యేకంగా కలిశారు.మౌలానా వరంగల్ పర్యటన సందర్భంగా జరిగిన ఈ భేటీలో దైవిక,మత,సామాజిక సేవలతో పాటు పాత్రికేయ రంగానికి సంబంధించిన పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు.ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆన్‌లైన్,సోషల్ మీడియా ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో మీడియా సంస్థల బాధ్యత మరింత పెరిగిందని రియాజ్ బేగ్ పేర్కొన్నారు.వార్తల ప్రచురణలో వాస్తవ నిర్ధారణ,నిజాయితీ,నిష్పక్షపాత వైఖరికి ప్రాధాన్యత ఇస్తూ సమాజంలో ఐక్యత,సోదరభావం,సానుకూల ఆలోచనలను పెంపొందించేలా పాత్రికేయత కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.‘అప్నా వరంగల్ డాట్ కామ్’ద్వారా వరంగల్‌తో పాటు తెలంగాణవ్యాప్తంగా దైవిక,మత,విద్యా,సామాజిక,సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తున్నట్లు ఆయన వివరించారు.ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు సమాజంలోని సానుకూల కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు.ఈ సందర్భంగా మౌలానా మాసూమ్ సాఖిబ్ ఖాస్మీ మాట్లాడుతూ మీడియా కేవలం వార్తల ప్రసార సాధనం మాత్రమే కాదని,సామాజిక సంస్కరణ,నైతిక విలువల పెంపు,యువతకు సానుకూల మార్గనిర్దేశంలో కీలక పాత్ర పోషించగలదన్నారు.జర్నలిస్టులు వార్తల ఖచ్చితత్వం,వాస్తవికతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.కలం,మీడియా వేదికలను సమాజ నిర్మాణం,అభివృద్ధికి ఉపయోగించాలని పేర్కొన్నారు.సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో యువతకు సానుకూల,నిర్మాణాత్మక సందేశాలను చేరవేయాల్సిన అవసరం ఉందన్నారు.సమాజంలో మంచితనం,ఐక్యత,సోదరభావం,నైతిక విలువలు,సేవాభావాన్ని పెంపొందించే సమాచారాన్ని ప్రోత్సహించాలని సూచించారు.‘అప్నా వరంగల్ డాట్ కామ్’మరింత అభివృద్ధి చెంది ప్రజలకు సేవలందించాలని మౌలానా ఆకాంక్షించారు.ఎడిటర్ రియాజ్ బేగ్ చేస్తున్న పాత్రికేయ కృషిని అభినందిస్తూ పలు విలువైన సూచనలు,సలహాలు అందించారు.మౌలానా అందించిన మార్గనిర్దేశం,ప్రోత్సాహానికి రియాజ్ బేగ్ కృతజ్ఞతలు తెలిపారు.