🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 10 Sep, 2026 | Page: 1

తెలంగాణ విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు

వరంగల్,హనుమకొండ జిల్లాల విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల ఎన్నికలు వరంగల్ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి వారి ఆలయం ధ్యాన మందిరంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా తెలంగాణ విశ్వబ్రాహ్మణ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తూములూరి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తం గా విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల ఐక్యత, విశ్వబ్రాహ్మణ జాతి సమైక్యతను చాటేందుకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. రాష్టంలో ప్రింటు&ఎలెక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టు యూనియన్ లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. త్వరలోనే అన్ని జిల్లాలో కమిటీలు ఏర్పాటు చేసి రాష్ట్ర మహా సభని ఏర్పాటు చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెండెంట్ మండలోజు కృష్ణ ప్రసాద్,ఆర్గనైజింగ్ కార్యదర్శి వడ్ల ప్రవీణ్ చారి,రాష్ట్ర కమిటీ సభ్యులు సర్వేశ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ సహాయ కార్యదర్శి,ఐ. జె.యూ జిల్లా కోశాధికారి డా.పొడి శెట్టి విష్ణు వర్ధన్ మాట్లాడుతూ వరంగల్,హనుమకొండ జిల్లాల కమిటీలు ఏర్పాటు చేయడం హర్షదాయకం అని నూతన కమిటీ అందరిని కలుపుకుని ముందుకు పోయి జర్నలిస్టుల ,విశ్వబ్రాహ్మణ జాతి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ సమావేశం లో రాష్ట్ర అధికార ప్రతినిధి ఓదెల.సత్యనారాయణ,రాష్ట్ర కార్యదర్శి కలకోటి వీరభద్రయ్య చారి నిర్వహణ కర్తలుగా వ్యవహరించారు.అనంతరం రాష్ట్ర కమిటీ అధ్వర్యంలో జిల్లాల కమిటీ ని ప్రకటించింది. వరంగల్ జిల్లా అధ్యక్షులుగా కుంటామల్ల అరవింద్,ప్రధాన కార్యదర్శి గా మునిగంటి అమరెందర్, ఉపాధ్యక్షులు గా అకోజు సాంబయ్య కోశాధికారి ఆర్.శ్రీనివాస్ లు ఎన్నికయ్యారు.హనుమకొండ జిల్లా అధ్యక్షులుగా ఉల్లి వెంకటేశ్వర్లు,కార్యదర్శి గా దెంచనాల రాజు,కోశాధికారిగా పొడిచెట్టి రమేష్ లు ఎన్నికయ్యారు. అనంతరం వరంగల్ ప్రెస్ క్లబ్ సహాయ కార్యదర్శి డా.పొడిచెట్టి విష్ణువర్ధన్ నూతనంగా ఎన్నికైన కమిటి సభ్యుల తో ప్రమాణ స్వీకారం చేయించి శాలువలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మారేడోజు సదనందాచారి,ప్రధాన కార్యదర్శి జి.పెంటయ్య చారి, సుగ్రీవ చారి ,బ్రహ్మ చారి, శ్రీనివాస్,కిరణ్, మహేష్,శ్రవణ్,పూర్ణచందర్,గురు బ్రహ్మము, జర్నలిస్టులు పాల్గొన్నారు.
🏠 Home