విద్యుత్ ప్రమాదంలో చిన్నారి జీవితం అతలాకుతలం చికిత్సకు దాతలే దిక్కు
వరంగల్: విద్యుత్ ప్రమాదంలో 11 ఏళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చిన్నారి చికిత్సకు భారీగా ఖర్చు అవుతుండటంతో కుటుంబ సభ్యులు దాతల ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
సెప్టెంబర్ 4న వరంగల్‌లో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి కుమారుడు అభికరుణ్ (11) ఇంటిపై ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు 11 కేవీ విద్యుత్ తీగలు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో ఉన్న యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి అక్కడ చికిత్స పొందుతున్నాడు.
చిన్నారి పరిస్థితి దృష్ట్యా మరో 2 నుంచి 3 నెలల పాటు చికిత్స అవసరమని, ఇందుకు సుమారు రూ.25 నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపినట్లు వారు పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డులు పనిచేయకపోవడంతో వైద్య ఖర్చులను భరించడం కుటుంబానికి తీవ్ర భారంగా మారింది. ఇతర ఆదాయ మార్గాలు లేక కేవలం ప్రభుత్వ ఉద్యోగంపైనే ఆధారపడుతున్న ఈ కుటుంబం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఒకవైపు కుమారుడి ప్రాణాలను కాపాడుకోవాలనే ఆందోళన, మరోవైపు భారీగా పెరుగుతున్న వైద్య ఖర్చులతో తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
ఈ నేపథ్యంలో మానవతా దృక్పథంతో స్పందించి చిన్నారి అభికరుణ్ చికిత్సకు తమకు తోచినంత ఆర్థిక సహాయం అందించాలని కుటుంబ సభ్యులు దాతలు, సేవా సంస్థలు, దాతృత్వ హృదయం కలిగిన ప్రతి ఒక్కరినీ కోరుతున్నారు.
సహాయం కోసం సంప్రదించాల్సిన సెల్ నంబర్:
8520942727