న్యూ శాయంపేట పోచమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి
హనుమకొండ : హనుమకొండ నగరంలోని న్యూ శాయంపేట 31వ డివిజన్‌లో గురువారం పోచమ్మ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా డివిజన్ మాజీ కార్పొరేటర్ మామిండ్ల రాజు యాదవ్, వేల్పుల మోహన్ రావుల ప్రత్యేక ఆహ్వానం మేరకు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రామ్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీక అని కొనియాడారు. న్యూ శాయంపేట 31వ డివిజన్ ప్రజలందరికీ, అలాగే హనుమకొండ జిల్లా ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మాస్టర్ ట్రైనింగ్ కమిటీ మెంబర్ మారంరెడ్డి కౌటిల్ రెడ్డి, వేల్పుల రోహిత్, స్థానిక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.