యూరియా యాప్‌తో రైతులకు ఇక్కట్లు! పాత యాప్‌తో సులభంగా యూరియా... కొత్త యాప్‌తో చుక్కలు | షాపుల్లో నిల్వ ఉన్నా రైతులకు అందని ద్రాక్ష
జన చరిత్ర న్యూస్ పర్వతగిరి
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా బుకింగ్, స్టాక్ వివరాలు, స్లాట్ బుకింగ్ వంటి ప్రక్రియలను డిజిటల్ విధానంలో నిర్వహించాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో రైతులకు మాత్రం కొత్త సమస్యలు ఎదురవుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారికంగా ఈ యాప్ ద్వారా యూరియా లభ్యతను తెలుసుకుని, అవసరమైన పరిమాణాన్ని బుక్ చేసుకునే విధానం అమల్లో ఉంది.
గతంలో ఉన్న యాప్ ద్వారా రైతులు సులభంగా యూరియా బస్తాలు పొందేవారని, ప్రస్తుతం కొత్త యాప్‌లో బుకింగ్, స్లాట్, వివరాల నమోదు తదితర ప్రక్రియలు క్లిష్టంగా మారడంతో రైతులు గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు పర్వతగిరి మండలంలోని కొన్ని ఫర్టిలైజర్ దుకాణాల్లో యూరియా బస్తాలు నిల్వ ఉన్నప్పటికీ, యాప్ ప్రక్రియ పూర్తికాక రైతులకు యూరియా అందడం లేదని రైతులు వాపోతున్నారు. పంటకు కీలకమైన సమయంలో యూరియా కోసం రైతులు షాపుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడటంపై వ్యవసాయ శాఖ అధికారులు తక్షణమే స్పందించాలని రైతులు కోరుతున్నారు.
యాప్ రైతుల కోసం... రైతులకే ఇబ్బందా?
యూరియా పంపిణీలో పారదర్శకత, అక్రమాల నియంత్రణ, రైతులకు సులభంగా ఎరువులు అందించడం లక్ష్యంగా డిజిటల్ విధానం తీసుకొచ్చినప్పటికీ, సాంకేతిక సమస్యలు లేదా ప్రక్రియలో ఇబ్బందులు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రైతులు అంటున్నారు.
ఫర్టిలైజర్ షాపుల్లో ఉన్న యూరియా నిల్వలు, యాప్‌లో చూపిస్తున్న స్టాక్, రైతులకు వాస్తవంగా పంపిణీ చేసిన బస్తాల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
పంటల సాగు కీలక దశలో ఉన్న సమయంలో యూరియా కోసం రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా, పాత విధానంలో ఉన్న సౌలభ్యాన్ని పరిగణనలోకి తీసుకుని కొత్త యాప్‌లోని సాంకేతిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.