🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 10 Sep, 2026 | Page: 1

ట్రాన్స్‌జెండర్లకు నల్గొండ డీఎస్పీ కే. శివరాం రెడ్డి వార్నింగ్!

బలవంతపు వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవు చట్టాలను గౌరవిస్తూ గౌరవప్రదంగా జీవించాలి: నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి

నల్లగొండ: ట్రాన్స్‌జెండర్లు చట్టాలను గౌరవిస్తూ గౌరవప్రదమైన జీవనం సాగించాలని నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి సూచించారు. దుకాణాలు, వ్యాపార సంస్థలు, ఇళ్ల వద్ద బలవంతంగా డబ్బులు డిమాండ్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ట్రాన్స్‌జెండర్లతో నిర్వహించిన అవగాహన సమావేశంలో డీఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ.. ట్రాఫిక్ సిగ్నల్స్, పండుగలు, శుభకార్యాల సమయంలో ప్రజలను ఇబ్బందులకు గురిచేయకూడదని సూచించారు. డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడం, బెదిరించడం, అసభ్యంగా ప్రవర్తించడం వంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.ప్రజలను వేధించినా, బలవంతపు వసూళ్లకు పాల్పడినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులు ఉంటే నేరుగా పోలీసులను సంప్రదించాలని సూచించారు.“ట్రాన్స్‌జెండర్లు సమాజంలో ఒక భాగమే. వారిని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. అదే సమయంలో ప్రజల హక్కులు, స్వేచ్ఛకు భంగం కలగకుండా ట్రాన్స్‌జెండర్లు కూడా చట్టబద్ధంగా వ్యవహరించాలి” అని డీఎస్పీ శివరాం రెడ్డి సూచించారు. ఈ అవగాహన సమావేశంలో సీఐలు ఆదిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఎస్‌ఐలు సైదాబాబు, షరీఫ్‌తో పాటు పట్టణంలోని పలువురు ట్రాన్స్‌జెండర్లు పాల్గొన్నారు.
🏠 Home