అక్రమంగా మద్యం విక్రయం.. ఇద్దరు అరెస్ట్
గీసుకొండ: అక్రమంగా ఐఎంఎఫ్‌ఎల్ మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు గీసుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాగిళ్లచెర్లలో పక్కపక్కనే నిర్వహిస్తున్న రెండు బెల్ట్ షాపులపై టాస్క్‌ఫోర్స్ సిబ్బంది దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో **ఒరుకొండ రవి (65), మెరుగు అశోక్ (62)**లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఆఫీసర్స్ ఛాయిస్, రాయల్ స్టాగ్, ఇంపీరియల్ బ్లూ, విల్సన్ హౌస్, కింగ్‌ఫిషర్ లైట్, కింగ్‌ఫిషర్ స్ట్రాంగ్ తదితర బ్రాండ్లకు చెందిన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న మద్యం మొత్తం విలువ రూ.5,940గా పోలీసులు తెలిపారు. నిందితులు మరియు స్వాధీనం చేసుకున్న మద్యాన్ని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం గీసుకొండ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.
ఈ దాడిలో ఏసీపీ ఏ. మధుసూదన్, ఇన్‌స్పెక్టర్ జి. సుభారెడ్డి, ఎస్‌ఐ బి. ఉప్పలయ్యతో పాటు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.