🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 11 Sep, 2026 | Page: 1

బీసీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు టీఎస్‌ఓబీఎంఎంఎస్‌లో సెప్టెంబర్ 15లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

నల్లగొండ, సెప్టెంబర్ 11, 2026:
రాష్ట్ర ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలో భాగంగా, వెనుకబడిన తరగతులకు (బీసీ) చెందిన మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు అందించి, కుట్టు వృత్తి ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టింది.
బీసీ మహిళల ఉత్పాదకతను పెంపొందించడంతో పాటు, వారి కుట్టు వృత్తిని అభివృద్ధి చేసి, ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రోత్సహించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలో నల్లగొండ పట్టణ పరిధిలోని అర్హత కలిగిన బీసీ మహిళలు TSOBMMS పోర్టల్‌లో సెప్టెంబర్ 15, 2026లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అర్హతలు:

1. బీసీ వర్గానికి చెందిన నిరుద్యోగ మహిళ అయి ఉండాలి.
2. ఫుడ్ సెక్యూరిటీ కార్డు (FSC) కలిగి ఉండాలి.
3. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2,00,000/-లకు మించరాదు.
4. దరఖాస్తుదారురాలి వయస్సు 18 నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.
5. ఆధార్ కార్డు కలిగి ఉండాలి.

దరఖాస్తుల సమర్పణ

అర్హత కలిగిన మహిళలు ముందుగా TSOBMMS పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన అనంతరం, సంబంధిత దరఖాస్తు ప్రతిని అవసరమైన పత్రాలతో కలిసి నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలి.

కావున నల్లగొండ పట్టణ పరిధిలోని అర్హత కలిగిన బీసీ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, సెప్టెంబర్ 15, 2026లోగా ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసి, దరఖాస్తులను మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలని అధికారులు కోరారు.

🏠 Home