🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 11 Sep, 2026 | Page: 1

పీడీఎస్ బియ్యం అక్రమ సేకరణ, తరలింపుపై ఒకరి అరెస్ట్

వరంగల్‌లో పీడీఎస్ బియ్యం అక్రమంగా సేకరించి తరలిస్తున్న వ్యక్తిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనుమానిత ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు.
ఈ దాడిలో గోవిందుల గణేష్ (30) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి సుమారు 35 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం, బ్రోకెన్ రైస్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.1,22,500గా పోలీసులు తెలిపారు.
అలాగే బియ్యం బస్తాలు కుట్టే క్లోజర్ మెషిన్ ఒకటి, వెయింగ్ మెషిన్ ఒకటి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం వస్తువుల విలువ సుమారు రూ.1,27,500గా అంచనా వేశారు.
అరెస్టైన వ్యక్తిని గోవిందుల గణేష్, తండ్రి రవి, వయస్సు 30 సంవత్సరాలు, ఆటో డ్రైవర్, క్రిస్టియన్ కాలనీ, వరంగల్గా పోలీసులు గుర్తించారు.
అరెస్టైన నిందితుడితో పాటు స్వాధీనం చేసుకున్న పీడీఎస్ బియ్యం, ఇతర సామగ్రిని తదుపరి చట్టపరమైన చర్యల కోసం మిల్స్ కాలనీ పోలీసులకు అప్పగించారు.
ఈ దాడిలో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ ఎ. మధుసూదన్, ఇన్‌స్పెక్టర్ జి. సుబ్బారెడ్డి, ఎస్‌ఐ బి. ఉప్పలయ్యతో పాటు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home