పర్యావరణహిత గణపతి విగ్రహాల తయారీ
గీసుకొండ మండలం, ఎలుకుర్తి హవేలి:
పర్యావరణ పరిరక్షణలో భాగంగా చేపట్టిన ‘ఎకో లైఫ్ మిషన్’ కార్యక్రమంలో భాగంగా గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS)లో విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పర్యావరణహిత గణపతి విగ్రహాల తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్.పి. రంగనాథ్ నేతృత్వం వహించారు. విద్యార్థులు సహజసిద్ధమైన పదార్థాలతో గణపతి విగ్రహాలను తయారు చేస్తూ పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణపై అవగాహన పెంపొందించుకున్నారు. పర్యావరణానికి హాని కలిగించే రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి విగ్రహాలను వినియోగించాలని ఈ సందర్భంగా సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కిరణ్మయి, శ్రీనివాస్, కిషోర్, సురేష్, కిషన్, ప్రవళిక, నాన్ టీచింగ్ సిబ్బంది నాగమణి, సూర్య, మాధవి, శంకర్ పాల్గొన్నారు. గ్రామస్థులు కూడా కార్యక్రమానికి హాజరై ఉపాధ్యాయులను అభినందించి, పర్యావరణహిత గణపతి విగ్రహాల తయారీని ప్రోత్సహించారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్థుల సమక్షంలో కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే అవగాహన కల్పించడం ద్వారా భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు.