🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 11 Sep, 2026 | Page: 1

మైనార్టీల సమస్యలపై గొంతెత్తిన సారయ్యకుకాంగ్రెస్ సీనియర్ నాయకులు అబ్దుల్ తాహిర్ ఆధ్వర్యంలో సన్మానం


*తెలంగాణ వరంగల్ సెప్టెంబర్ 11*

వరంగల్‌: మైనార్టీల సంక్షేమం,సమస్యలపై శాసనమండలిలో గళం వినిపిస్తున్న ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యను కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు అబ్దుల్‌ తాహెర్‌ తో పాటు పలువురు మైనార్టీ నాయకులు,సోదరులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సారయ్యను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు.మైనార్టీల సంక్షేమ పథకాల అమలు,షాదీముబారక్‌,షాదీఖానాల అభివృద్ధి,మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలలకు నిధుల విడుదల,పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కేటాయింపు తదితర అంశాలపై సారయ్య శాసనమండలిలో ప్రశ్నించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.మైనార్టీల సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో మైనార్టీ నాయకులు,కార్యకర్తలు,పలువురు సోదరులు పాల్గొన్నారు.
🏠 Home