🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 11 Sep, 2026 | Page: 1

జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలి 18, 19 తేదీల్లో కలెక్టరేట్ ఎదుట TUWJ-IJU రిలే నిరాహార దీక్షలు

నల్గొండ: జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలని TUWJ-IJU నాయకులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 18, 19 తేదీల్లో కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు.

రిలే నిరాహార దీక్షలకు అనుమతి కోరుతూ TUWJ-IJU జిల్లా నాయకులు డీఎస్పీ కె. శివరాంరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమం, వారి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ముఖ్యంగా జర్నలిస్టులకు ఇంటి స్థలాల కేటాయింపు సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పులి మామిడి మహేందర్ రెడ్డితో పాటు పలువురు జిల్లా నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.
🏠 Home