*కాంగ్రెస్ దుశ్చర్యలపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు* *అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులపై పోలీసుల దౌర్జన్యం ఎంపీ రవిచంద్ర* *తెలంగాణ న్యూఢిల్లీ సెప్టెంబర్ 11* తెలంగాణలో ప్రజలకే కాకుండా ప్రజాప్రతినిధులకు కూడా రక్షణ లేకుండా పోయిందని బీఆర్‌ఎస్ పార్లమెం
కాంగ్రెస్ దుశ్చర్యలపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదుఅసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులపై పోలీసుల దౌర్జన్యం ఎంపీ రవిచంద్ర
*తెలంగాణ న్యూఢిల్లీ సెప్టెంబర్ 11*
తెలంగాణలో ప్రజలకే కాకుండా ప్రజాప్రతినిధులకు కూడా రక్షణ లేకుండా పోయిందని బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత,ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకే బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులపై దాడులు,నిర్బంధాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.ఢిల్లీ తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఎమ్మెల్యేలు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి,పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి రవిచంద్ర విలేకరులతో మాట్లాడారు.అంతకుముందు బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులతో కలిసి జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయ రహత్కర్,మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతిని కలిసి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పోలీసుల వ్యవహరించిన తీరును వివరించారు.ఈ అంశాలపై ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ)లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున సుమారు 500 మంది పోలీసులు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలను అడ్డుకున్నారని రవిచంద్ర ఆరోపించారు.మహిళా ప్రజాప్రతినిధుల చుట్టూ పురుష పోలీసులు,పురుష ప్రజాప్రతినిధులను మహిళా పోలీసులు అడ్డుకోవడం దౌర్జన్యానికి నిదర్శనమన్నారు.ఎమ్మెల్సీలు తాతా మధు,నవీన్‌కుమార్‌రెడ్డిలను పోలీసులు నేరస్తుల మాదిరిగా అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించాలనుకున్నారని,అయితే న్యాయస్థానం దానిని తిరస్కరించిందన్నారు.అసెంబ్లీ వద్ద పోలీసుల తీరుపై హైకోర్టు కూడా తప్పుబట్టిందని పేర్కొన్నారు.ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు, కుట్రలు చేసినా బీఆర్‌ఎస్ వెనక్కి తగ్గబోదని రవిచంద్ర స్పష్టం చేశారు.ప్రజల సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీలోనూ,మీడియా,సోషల్ మీడియా వేదికలపైనా ఎప్పటికప్పుడు ఎండగడతామని తెలిపారు.పార్లమెంటులో ఒక విధానం,కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మరో విధానం అవలంబించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.