🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 11 Sep, 2026 | Page: 1

అనాథాశ్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ పోతన ఆధ్వర్యంలో అన్నదానం

వరంగల్: లయన్స్ క్లబ్ ఆఫ్ పోతన ఆధ్వర్యంలో హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్‌లో భాగంగా శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు అతిథి అనాధాశ్రమంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.

క్లబ్ సభ్యులు మెంతుల శశిధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆశ్రమంలోని పిల్లలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ పోతన అధ్యక్షులు సింగారపు శ్రీకర్ మాట్లాడుతూ, సేవా కార్యక్రమాల్లో భాగంగా అవసరమైన వారికి ఆహారం అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సింగారపు శ్రీకర్, ఆడపు రవీందర్, లకుo ఐలయ్యతో పాటు అతిథి అనాధాశ్రమం నిర్వాహకులు పాల్గొన్నారు.
🏠 Home