🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 12 Sep, 2026 | Page: 1

శ్రావణమాసం ముగింపు సందర్భంగా సింహాచల నరసింహ స్వామికి ప్రత్యేక అలంకరణ.

శ్రావణమాసం ముగింపు సందర్భంగా సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అత్యంత సుందరంగా ప్రత్యేక అలంకరణ చేశారు. ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన స్వామివారిని భక్తులు దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణమాసంలో స్వామివారిని దర్శించుకోవడం ఎంతో శుభప్రదమని ఆలయ అర్చకులు తెలిపారు. ప్రత్యేక పూజల సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో కళకళలాడింది.
🏠 Home