చౌటుప్పల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కి చేరిన నీటి శుద్ధి యంత్రం కానీ?
చౌటుప్పల్: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత కొన్ని నెలలుగా విద్యార్థులు త్రాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. దీనిపై కళాశాల యాజమాన్యం విన్నవించగా, స్థానికంగా ఉన్న ఒక పరిశ్రమ యాజమాన్యం నీటి శుద్ధి యంత్రాన్ని కళాశాలకు అందించడం జరిగింది. కానీ దానికి సంబంధించిన ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ పనులు పూర్తి కాకపోవడంతో ఇంకా ఆ నీటి శుద్ధి యంత్రం అందుబాటులో కి రాలేదు. ఈ విషయమై జన చరిత్ర న్యూస్ కళాశాల ప్రిన్సిపాల్ ని సంప్రదించగా, పెండింగ్ పనులను రెండు,మూడు రోజుల్లో పూర్తి చేయించి,సమస్యకు పరిష్కారం చూపి త్రాగునీటిని అందుబాటులోకి తెస్తామని చెప్పడం జరిగింది.