కల్లెడ గ్రామoలోనీ VOA పోస్టు ను వెంటనే భర్తీ చేయాలి. *మాజీ రైతుబంధు మండల అధ్యక్షుడు చిన్నపాక శ్రీనివాస్*

జన చరిత్ర న్యూస్ పర్వతగిరి , సెప్టెంబర్ 28 :* పర్వతగిరి మండలం సోమవారం రోజున ప్రజావాణిలో ఎంపీడీవో వినతి పత్రం అందజేసిన మాజీ రైతు బంధు మండల అధ్యక్షుడు చిన్నపాక శ్రీనివాస్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలోని జ్యోతి గ్రామైక్య సంఘంలో గతంలో VOA (Village Organization Assistant) గా విధులు నిర్వహిస్తున్న తక్కలపల్లి శ్రీనివాస్ గత సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచిగా పోటీ చేసి గెలుపొందడం జరిగినది. ప్రస్తుతం కల్లెడ గ్రామ సర్పంచ్ గా ఎన్నికై విధులు నిర్వహిస్తున్నారు. సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టిన నుండి, అనగా గత 9 నెలలుగా VOA పోస్టు ఖాళీగా ఉంది. దీని వలన గ్రామంలోని...