రెడ్ క్రాస్ చైర్మన్ బేతి అశోక్ బాబుకు ఘన సన్మానం
వరంగల్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా చైర్మన్గా నూతనంగా ఎన్నికైన బేతి అశోక్ బాబు గారిని రుద్రమదేవి వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రుద్రమదేవి వాకర్స్ అసోసియేషన్ సభ్యులు బేతి అశోక్ బాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసి, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్గా ఎన్నికైనందుకు అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు విస్తృతంగా సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆవుల రమేష్, మిట్టపల్లి రాజేందర్, పోలు బిక్షపతి, బూర ప్రవీణ్, కొలిపెళ్లి రఘునాథ్, గుళ్ళపల్లి రామకృష్ణ, బండారి రాజబాబు, కనుగంటి రాములు తదితర రుద్రమదేవి వాకర్స్...