జర్నలిస్టుల సంక్షేమమే ప్రధాన లక్ష్యం టీయూడబ్ల్యూజే(143) జిల్లా అధ్యక్షుడు జయశంకర్ గౌడ్

నల్లగొండ, సెప్టెంబర్ 30: జర్నలిస్టుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా టీయూడబ్ల్యూజే(143) పనిచేస్తోందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గుండగోని జయశంకర్ గౌడ్ అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో నూతనంగా ఎన్నికైన టీయూడబ్ల్యూజే(143) నల్లగొండ మండల కమిటీని అభినందించిన అనంతరం ఆయన మాట్లాడారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం గతంలో హెల్త్ కార్డుల సాధనతో పాటు మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయం, వారి పిల్లల విద్యకు చేయూత అందించినట్లు తెలిపారు. కరోనా సమయంలోనూ అల్లం నారాయణ ఆధ్వర్యంలో కరోనా బారిన పడిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం జర్నలిస్టుల హెల్త్ కార్డులు కొన్ని ఆసుపత్రుల్లోనే పరిమితంగా అమలవుతున్నాయని, రాష్ట్రంలోని...