అన్నారం గ్రామంలో బతుకమ్మ విగ్రహ ప్రతిష్ట స్థలంలో భూమి పూజ కార్యక్రమం - చెరువు కట్టపైన దర్గా సమీపంలో ఏర్పాటు

జన చరిత్ర న్యూస్ పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలోని చెరువు కట్టపైన దర్గా సమీపంలో గల మెట్ల పై బతుకమ్మ విగ్రహ ప్రతిష్ట చేయు స్థలంలో ఈరోజు భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మహేందర్ మాట్లాడుతూ, బతుకమ్మ విగ్రహ ప్రతిష్ట గ్రామ సంస్కృతి, సంప్రదాయాన్ని కాపాడుకోవడంలో ముఖ్యమైన అడుగు అని, గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. ఈ ప్రతిష్ట కార్యక్రమం గ్రామ ఐక్యతకు, సమైక్యతకు నిదర్శనమని అన్నారు. వరంగల్ మార్కెట్ డైరెక్టర్ గొడుగు బిక్షపతి మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధిలో ఇటువంటి కార్యక్రమాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని, తాను సదా గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో...