గుండె జబ్బులపై అవగాహన..ఉచిత ఓపీ,సీపీఆర్ శిక్షణ

*తెలంగాణ,వరంగల్,సెప్టెంబర్ 29* హనుమకొండ: ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ఏకాశిల ఆస్పత్రి ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రకటించింది.నెల రోజుల పాటు ఆస్పత్రిలో ఉచిత ఓపీ సేవలు అందించనున్నట్లు ఆస్పత్రి యాజమాన్యం వెల్లడించింది.ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి.రమేష్,మెడికల్ డైరెక్టర్,ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ విభాగం అధిపతి డాక్టర్ అసిఫ్ ఇక్బాల్ ఎస్‌కే,జనరల్ మేనేజర్ శ్రీదేవి వివరాలు వెల్లడించారు.ప్రస్తుతం గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని, ముఖ్యంగా యువతలో గుండెపోటు ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని వైద్యులు తెలిపారు.గుండెపోటు సంభవించినప్పుడు సకాలంలో ప్రథమ చికిత్స అందించడం ఎంతో కీలకమన్నారు.పేద,మధ్యతరగతి ప్రజలకు నిపుణులైన వైద్యుల సలహాలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నెల...