*విద్యార్థుల పాలిట గురువే కాల యమూడు
జన చరిత్ర మహబూబాబాద్ జిల్లా బ్యూరో తొర్రూర్, సెప్టెంబర్ 30 *విద్యార్థులను వంట మనుషుల్లాగా చేసి చపాతీలు చేపిస్తున్న తీరు* *ఘటన జరిగినప్పుడల్లా, పై అధికారులను తప్పు తోవ పట్టిస్తున్న కిలాడి ప్రిన్సిపాల్* *ఎన్ని సంఘటనలు జరిగిన పట్టించుకోని విద్యాశాఖ ఉన్నతాధికారులు* తొర్రూరు పట్టణ కేంద్రంలో అన్నారం రోడ్డు వెళ్లే రహదారి పక్కన ఉన్న మహాత్మ జ్యోతి రావు బాపూలే, గురుకుల పాఠశాలలో, ప్రిన్సిపాల్ తన ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తూ,విద్యార్థులను పని మనుషుల్లాగా పని చేయిస్తూ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వర్కర్లపై తోసేస్తూ తన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఉన్నత అధికారులకు తప్పుడు సమాచారాన్ని అందిస్తూ, క్రింది స్థాయి ఉద్యోగులను వేధిస్తున్న తీరుపై స్థానికులు చర్చించుకుంటున్నారు....