సేవా సంకల్పంలో భాగంగా జ్యోతిరావు పూలే గురుకుల హాస్టల్ సందర్శన.

వరంగల్: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పాలన 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప కార్యక్రమాల్లో భాగంగా నేడు ఓబీసీ మోర్చా వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో వరంగల్‌లోని జ్యోతిరావు పూలే గురుకుల హాస్టల్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గంధ మల్ల ఆనంద్ గౌడ్ గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు పాల్గొని హాస్టల్‌లోని ఉపాధ్యాయులు మరియు విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల విద్య, వసతి, వారి ఎదుర్కొంటున్న సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని...