పిల్లల్లోని ప్రతిభను గుర్తించి వారిని సరైన దిశలో ప్రోత్సహించడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత. -ఎస్పీ డా. శబరీష్,, ఐపీఎస్.
ముల్లంగి మోహన్ రెడ్డి తెలంగాణ ఎసెన్స్ మహబూబాబాద్ జిల్లా కరస్పాండెంట్ సెప్టెంబర్ 30 కరాటే పోటీల్లో స్వర్ణ పతకాలు సాధించిన పోలీస్ కానిస్టేబుల్ కుమారుడు విఘ్నేష్‌ను అభినందించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఐపీఎస్ వరల్డ్ ఫునాకోషి షోటోకాన్ కరాటే ఆర్గనైజేషన్ (WFSKO) ఆధ్వర్యంలో ముంబైలోని ప్రియదర్శిని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన 37వ ఆల్ ఇండియా / ఇంటర్నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో విధిలు నిర్వహిస్తున్న ఉన్న పోలీస్ కానిస్టేబుల్ సోమలింగయ్య కుమారుడు జి. విఘ్నేష్ యాదవ్ ప్రతిభ కనబరిచి రెండు స్వర్ణ పతకాలు సాధించాడు. అండర్-12 ఆరంజ్ బెల్ట్ విభాగంలో అద్భుతమైన ప్రతిభను కనబరిచి ప్రథమ స్థానంలో...