బాలపాల లింగ్యా తండాలో పోలీసుల తనిఖీలు 20 వాహనాలు గుర్తింపు.. గుడుంబా, బెల్లం ఊట ధ్వంసం
తెలంగాణ ఎసెన్స్ మహబూబాబాద్ జిల్లా కరస్పాండెంట్, సెప్టెంబర్ 30: కురవి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలపాల లింగ్యా తండాలో బుధవారం ఉదయం పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఉదయం 5:30 గంటల నుంచి 7:45 గంటల వరకు సుమారు 100 ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 20 వాహనాలను గుర్తించారు. అలాగే అక్రమంగా తయారు చేస్తున్న 30 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని, సుమారు 1,000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం గ్రామస్తులకు రోడ్డు ప్రమాదాల నివారణ, గంజాయి...