సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి *ఏసిపి సదయ్య విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

సైబర్ నేరాలపై విద్యార్థులు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఏసీపీ సదయ్య అన్నారు. హనుమకొండ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాలు, అఘాయిత్యాలు పెరుగుతున్న నేటి కాలంలో నేరాల అదుపులో అందరు భాగస్వామ్యం కావాలని తమవంతు బాధ్యతలను నిర్వర్తించాలని, జాగ్రత్తతో మెలగడం వల్ల మహిళల మీద జరిగే నేరాలను అదుపు చేయవచ్చని అన్నారు. అమ్మాయిలు ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, స్నాప్ చాట్, టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు, వివరాలు పంచుకోవడంలో జాగ్రత్త వహించాలని, సైబర్ నేరాల పై,అవగహన కలిగివుండాలని మరియు మహిళలు ఒంటరిగా తెలియని ప్రదేశాలకు ప్రయాణం చేయవలసి...