పీఎం విశ్వకర్మ యోజనపై స్వర్ణకారుల ప్రత్యేక సమావేశం

వరంగల్: వరంగల్ విశ్వకర్మ వీధిలోని విశ్వకర్మ స్వర్ణకార వసతి భవన్‌లో గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో పీఎం విశ్వకర్మ యోజనపై స్వర్ణకారుల ప్రత్యేక సమావేశం బుధవారం (30-09-2026) నిర్వహించారు. ఈ సమావేశానికి ఇప్పటికే పీఎం విశ్వకర్మ యోజన ద్వారా లబ్ధి పొందిన స్వర్ణకారులతో పాటు, పథకం ద్వారా లబ్ధి పొందేందుకు ఆసక్తి ఉన్న పలువురు స్వర్ణకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పీఎం విశ్వకర్మ యోజనకు సంబంధించిన అర్హతలు, పథకం ద్వారా కలిగే ప్రయోజనాలు, దరఖాస్తు విధానం, ప్రభుత్వ సహాయాలు తదితర అంశాలపై స్వర్ణకారులకు అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి స్వర్ణకారుడు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సంఘం ప్రతినిధులు...