తక్షణమే స్పందించిన మున్సిపల్ సిబ్బంది : ప్లాస్టిక్ వ్యర్ధాలతో కూడిన చెత్తాచెదారాన్ని తొలగించిన పారిశుద్ధ్య కార్మికులు

చౌటుప్పల్: స్వచ్ఛత హీ సేవా 2026 కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్ మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, కమిషనర్ ఆదేశానుసారం, నాగులకుంట పక్కన షాది ఖానా నాలా లో పేరుకుపోయిన చెత్తాచెదారం, ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్స్, అనేక వ్యర్థ పదార్థాలను తొలగించి నీళ్లు సాఫీగా పోవుటకు చేయడం జరిగింది. జన చరిత్ర న్యూస్ వార్తను ప్రచురించగా, తక్షణమే స్పందించి మునిసిపల్ శాఖావారు చెత్తను తొలగించడం పట్ల , చైర్ పర్సన్ చూపిన చొరవపట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ స్థానికంగా ఉన్న సమస్యల ను పరిష్కరించడంలో ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ...