నేటి పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని విజయవంతం చేయాలి.. టీయూడబ్ల్యూజే(143) జిల్లా అధ్యక్షుడు జయశంకర్ గౌడ్
తిప్పర్తి అక్టోబర్ 1 : జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే క్యాష్ లెస్ చికిత్స అందించేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వారం రోజులపాటు టీయూడబ్ల్యూజే(143) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పోస్టు కార్డుల ఉద్యమాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గుండగోని జయశంకర్ గౌడ్ అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో నూతనంగా ఎన్నికైన టీయూడబ్ల్యూజే(143) తిప్పర్తి మండల కమిటీని అభినందించిన అనంతరం ఆయన మాట్లాడారు. టీయూడబ్ల్యుజే 143 అనే సంఘం జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు . జర్నలిస్టుల సంక్షేమం కోసం గతంలో హెల్త్ కార్డుల సాధనతో పాటు మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక...