చౌటుప్పల్: మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ప్రత్యేక దృష్టి. స్వచ్ఛత విషయంలో నిరంతర పర్యవేక్షణ.

చౌటుప్పల్ : పట్టణ స్వచ్ఛత విషయంలో ప్రత్యేక దృష్టి, నిరంతర పర్యవేక్షణ, సిబ్బందికి సలహాలు సూచనలు ఇవ్వడం ఇలా శుభ్రత విషయంలో మున్సిపల్ చైర్పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. గత 15 రోజుల పైగా ప్రత్యేక కార్యాచరణ తో పాటు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తున్న వారిని గుర్తించి జరిమానా విధించడం, స్వచ్ఛత విషయంలో అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. పరిశుభ్రత విషయంలో ఫిర్యాదులు అందిన వెంటనే వాటిని గుర్తించి క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ పట్టణ స్వచ్ఛత మనందరి బాధ్యత అని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలందరూ సహకరించాలని,...