మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు

వరంగల్, అక్టోబర్ 2: వరంగల్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా. బి. రాజా రెడ్డి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస, స్వచ్ఛత, మానవతా విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. గాంధీజీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ఆయన బోధించిన మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డా. రాజమౌళి, ఉప జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి...