ప్రభుత్వం తక్షణమే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి * టియుడబ్ల్యూజే ( ఐజేయు)జిల్లా అధ్యక్షుడు - గార్లపాటి కృష్ణారెడ్డి

నల్లగొండ, అక్టోబర్ 2: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని టి యు డబ్ల్యూ జే ( ఐజేయు) జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి కోరారు. ఐజేయు పిలుపుమేరకు నల్లగొండలోటి యూడబ్ల్యూజే ఆధ్వర్యంలో శుక్రవారం రామగిరి సెంటర్లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే జర్నలిస్టులకు ఇల్లా స్థలాలతోపాటు ఇల్లు కేటాయించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే హెల్త్ కార్డులు అందించి జర్నలిస్టులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పులిమామిడి మహేందర్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి. అశ్వక్ అహ్మద్....