మహిళల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి భారతి డిగ్రీ కళాశాలలో షీ టీమ్ ఎస్సై రామారావు అవగాహన సదస్సు
వరంగల్: మహిళలపై జరుగుతున్న నేరాలు, అఘాయిత్యాల నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వరంగల్ షీ టీమ్ ఎస్సై రామారావు సూచించారు. జాగ్రత్తగా, అప్రమత్తంగా వ్యవహరించడం ద్వారా మహిళలపై జరిగే నేరాలను అరికట్టవచ్చని తెలిపారు. వరంగల్‌లోని భారతి డిగ్రీ కళాశాలలో సుమారు 150 మంది విద్యార్థినులకు మహిళల భద్రత, సైబర్ నేరాలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, టీ-సేఫ్ యాప్ వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై రామారావు మాట్లాడుతూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్, టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత ఫొటోలు, వివరాలను పంచుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలు ఒంటరిగా తెలియని ప్రాంతాలకు ప్రయాణించాల్సి వచ్చినప్పుడు టీ-సేఫ్ యాప్‌ను వినియోగించుకోవాలని,...