కేయూసీ పోలీస్‌స్టేషన్ పరిధిలో అక్రమ మద్యం విక్రయంపై టాస్క్‌ఫోర్స్ దాడి రూ.1.12 లక్షల విలువైన మద్యం స్వాధీనం.. ఒకరి అరెస్ట్
హనుమకొండ, అక్టోబర్ 2: అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం కేయూసీ పోలీస్‌స్టేషన్ పరిధిలో దాడి నిర్వహించారు. హనుమకొండ వినాయకనగర్‌లోని లయోలా పాఠశాల సమీపంలో నిర్వహించిన ఈ దాడిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న అంగిడి సమ్మక్క (65)ను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి వివిధ రకాల మద్యం, బీరు సీసాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.1,12,430గా పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వాటిలో కేఎఫ్ లైట్ 114, కేఎఫ్ స్ట్రాంగ్ 53, బకార్డీ 31, బడ్వైజర్ టిన్ బీర్లు 127, టుబోర్గ్ బీర్లు 64, సుమో 180 ఎంఎల్ 42, ఆఫీసర్స్ ఛాయిస్ 180 ఎంఎల్...