కొత్తవాడలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు నల్లా నర్సింహులు శతజయంతి ఉత్సవాలు నిర్వహించిన చిప్ప వెంకటేశ్వర్లు నేత…..
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, విప్లవ సింహం పద్మశాలి ముద్దుబిడ్డ నల్ల నర్సింహులు శత జయంతి సందర్భంగా కొత్తవాడ 80 ఫీట్ల రోడ్ అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించిన చిప్ప వెంకటేశ్వర్లు నేత, ప్రజా సంఘం నాయకులు. దొరలకు భూస్వాములకు వెట్టి చాకిరికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి తుపాకి అందుకొని ప్రజా సైన్యం తయారుచేసి చైతన్యవంతం చేసి నిజాం గుండెల్లో సింహస్వప్నం లా నిలిచిన దీశాలి. 4000 వేల గ్రామాలు 15000 వేల ఎకరాల భూమిని వెట్టి నుండి విముక్తి చేసి ప్రజలకు పంచడం జరిగింది. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే రజాకార్ల మూకలను ఊర్ల నుంచి పొలిమేర వరకు తరిమిన వీరుడు...