జర్నలిస్టులకు వెంటనే హెల్త్ కార్డులు మంజూరు చేయాలి - తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (tuwj-h 143) రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిఆర్ లెనిన్

వరంగల్ లో హెల్త్ కార్డులు మంజూరు చేయాలని సీఎంకు ఉత్తరాలు, గాంధీ విగ్రహం ముందు నిరసన వరంగల్, అక్టోబర్ 2: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయి మూడు సంవత్సరాలు గడిచినప్పటికీ జర్నలిస్టులకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేయలేదని , ఇప్పటికైనా వెంటనే జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా హెల్త్ కార్డులు మంజూరు చేయాలని తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి ఆర్ లెనిన్ డిమాండ్ చేశారు. శుక్రవారం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని గాంధీ విగ్రహం వద్ద టీయూడబ్ల్యూజే 143 రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు అల్లం నారాయణ ప్రధాన కార్యదర్శి ఆస్కానీ మారుతి సాగర్ పిలుపుమేరకు వరంగల్ జిల్లా అధ్యక్షుడు కోరు కొప్పుల...