దొడ్డి కొమురయ్య విగ్రహం నెలకొల్పాలని వరంగల్ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు కొండ సురేఖ మురళీధర్ రావు కు వినతిపత్రం
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడైన బీసీ కులంను చెందిన కురుమ ముద్దుబిడ్డ దొడ్డి కొమురయ్య గారి రూపురేఖలు నేటి తరానికి తెలియపరచడానికి ప్రభుత్వపరంగా విగ్రహం నెలకొల్పాలని వరంగల్ జిల్లా కురుమ సంఘం కన్వీనర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో వరంగల్ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు కొండ సురేఖ మురళీధర్ రావు కు వినతిపత్రం ఇచ్చినారు దొడ్డి కొమురయ్య గారి జననం 2027 సంవత్సరంలో 100 సంవత్సరములు పూర్తి కావస్తుందని ఇప్పటివరకు ప్రభుత్వం వారి యొక్క పోరాట పటిమను నాలుగు గోడల మధ్య పొగుడుతున్నారని నేటి తరానికి తెలియపరచడానికి వరంగల్ నగరంలోని నాయుడు పెట్రోల్ పంపు జంక్షన్ వద్ద గాని ఉర్సుగుట్ట జంక్షన్ వద్ద గాని...