లేబర్ కాలనీలో అబ్బానికుంట లో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన రెడ్ క్రాస్ చైర్మన్ బేతి అశోక్ బాబు
వరంగల్: గాంధీ జయంతి సందర్భంగా వరంగల్ లేబర్ కాలనీలో కుడికాల శ్యామ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, వరంగల్ జిల్లా చైర్మన్ బేతి అశోక్ బాబు ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ బేతి అశోక్ బాబు మాట్లాడుతూ, మహాత్మా గాంధీజీ చూపిన సేవా, మానవతా మార్గాలను స్ఫూర్తిగా తీసుకొని సమాజంలోని పేదలు, నిరుపేదలకు సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో మానవతా విలువలను మరింత పెంపొందించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ శానబోయిన రాజ్ కుమార్,...