మట్వాడ పీఎస్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
సత్యం,అహింస,శాంతి మార్గాల్లో ప్రజలకు సేవ చేస్తామని పోలీసుల ప్రతిజ్ఞ *తెలంగాణ/వరంగల్,అక్టోబర్ 2* వరంగల్: మట్వాడ పోలీస్‌స్టేషన్‌లో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.సత్యం,అహింస,శాంతి,సామరస్య మార్గాలను స్మరించుకుంటూ ప్రజలకు నిజాయితీ,క్రమశిక్షణతో సేవలందించేందుకు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.కార్యక్రమంలో మట్వాడ సీఐ కరుణాకర్,ఎస్‌ఐలు శ్రీనివాస్,సాంబయ్య,పోలీస్‌స్టేషన్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.