మహిళలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించాలి మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
వరంగల్, అక్టోబర్ 2: మహిళలకు సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని గ్రేటర్ వరంగల్ తొలి మేయర్, వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శుక్రవారం మట్టేవాడలోని సెయింట్నరీ ట్రినిటీ బాప్టిస్ట్ చర్చిలో వరంగల్ క్రిస్టియన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒకరోజు మహిళల రీట్రీట్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. మహిళలకు రిజర్వేషన్లతో పాటు సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించాలన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో క్రిస్టియన్ భవన నిర్మాణానికి నిధులు, స్థలం కేటాయించడంతో పాటు వరంగల్లోని వివిధ క్రిస్టియన్ సొసైటీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఒకే వేదికగా పనిచేసేలా కృషి చేసినట్లు...