యూత్ నాయకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
జన చరిత్ర న్యూస్ పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ యువ నాయకుడు పుల్లూరి దిలీప్ గారు ఇటీవల అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు గారు దిలీప్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజా సేవలో, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. అవసరమైన సమయంలో తనకు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉంటారని భరోసా కల్పించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి యువ నాయకులు చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దిలీప్ గారు...