గాంధీజీ ఆశయాలను ఆచరించడమే ఆయనకు నిజమైన నివాళి
*ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఎర్రబెల్లి ఉషాదయాకర్ రావు* జన చరిత్ర న్యూస్ పర్వతగిరి మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఎర్రబెల్లి ఉషాదయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరై, మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి ఉషాదయాకర్ రావు మాట్లాడుతూ, మహాత్మా గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, సత్యాగ్రహం వంటి మహోన్నత విలువలు నేటి సమాజానికి కూడా ఎంతో అవసరమని అన్నారు. ఎలాంటి హింసకు తావులేకుండా సత్యం,...