పర్వతగిరిలో మహాత్మా గాంధీ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు
జన చరిత్ర న్యూస్ పర్వతగిరి మండల కేంద్రంలో *అభ్యుదయ యువత మరియు కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు కుసం రాంచందర్* అధ్వర్యంలో *గుండ వీర వెంకయ్య జ్ఞాపకార్ధం వారి కుమారుడు గుండ స్వయంప్రకాష్* ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహ అవిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి, పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, సామాజిక సమానత్వం, గ్రామ స్వరాజ్య స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ పోషించిన పాత్ర చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను...