తెలంగాణ అస్తిత్వ పరిరక్షణకు వరంగల్ నుంచే పోరాటం మామునూరు విమానాశ్రయానికి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టాలి తెలంగాణ నీళ్లు, వనరుల పరిరక్షణకు ఉద్యమిస్తాం: తెలంగాణ అస్తిత్వ వేదిక

హనుమకొండ, హంటర్‌రోడ్, అక్టోబర్ 2: తెలంగాణలో స్వయం పాలన పోయి పరాయి పాలన వచ్చిందని, రాష్ట్రం మనదైనా పాలన మాత్రం ఇతరుల కనుసన్నల్లో సాగుతోందని తెలంగాణ అస్తిత్వ వేదిక చైర్మన్ వీరమళ్ల ప్రకాష్ అన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని, వనరులను కాపాడుకునేందుకు వరంగల్ నుంచే మరో పోరాటానికి శ్రీకారం చుడతామని ప్రకటించారు. ఓబీసీ చైర్మన్, కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం హనుమకొండ హంటర్‌రోడ్‌లోని మాస్టర్‌జీ డిగ్రీ, పీజీ కళాశాల ఆడిటోరియంలో తెలంగాణ అస్తిత్వ వేదిక రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ అస్తిత్వ వేదిక చైర్మన్ వీరమళ్ల ప్రకాష్, విశిష్ట అతిథిగా తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కారం రవీందర్...