మహిళల భద్రతపై అవగాహన కలిగి ఉండాలి షీ టీమ్ ఆర్ఎస్సై స్వాతి

హనుమకొండ: మహిళల భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని వరంగల్ షీ టీమ్ ఆర్ఎస్సై స్వాతి సూచించారు. నేరాల నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై తమవంతు బాధ్యతను నిర్వర్తించాలని, అప్రమత్తంగా వ్యవహరించడం ద్వారా మహిళలపై జరిగే నేరాలను అరికట్టవచ్చని తెలిపారు. హనుమకొండలోని ఎంజీఎస్ బాలికల వసతి గృహంలో సుమారు 60 మంది విద్యార్థినులకు మహిళల భద్రత, సైబర్ నేరాలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్సై స్వాతి మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత చిత్రాలు, వివరాలను పంచుకునే విషయంలో విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలు ఒంటరిగా తెలియని ప్రాంతాలకు ప్రయాణించాల్సి వచ్చినప్పుడు టీ-సేఫ్ యాప్‌ను వినియోగించుకోవాలని, దానిపై...