జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి టీయూడబ్ల్యుజె(ఐజేయు)ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి వినతిపత్రం

*తెలంగాణ/వరంగల్,అక్టోబర్ 2* జర్నలిస్టుల హక్కులు,సంక్షేమం కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని టీయూడబ్ల్యుజె(ఐజేయు)జాతీయ కౌన్సిల్ సభ్యుడు సంగోజు రవి డిమాండ్ చేశారు.జాతీయ కమిటీ ఆదేశాలు,రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ‘పనిచేస్తున్న పాత్రికేయుల డిమాండ్ల దినం’ నిర్వహించారు.ఇందులో భాగంగా గ్రేటర్ వరంగల్ కార్యాలయం ఎదుట ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి,జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సంగోజు రవి మాట్లాడుతూ జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సదుపాయాలు కల్పించాలని,ప్రభుత్వ,ప్రైవేటు,కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సదుపాయం అమలు చేయాలని కోరారు.దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు,ఇళ్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్...