వాడవాడలా ఘనంగా గాంధీ జయంతి వేడుకలు*

*తెలంగాణ వరంగల్ అక్టోబర్ 2* వరంగల్: జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను వరంగల్ నగరంలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, కుడా చైర్‌పర్సన్ గుండు సుధారాణి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్,మేరా కార్పొరేషన్ చైర్మన్ సంఘ వెంకటరాజం ముఖ్య అతిథులుగా పాల్గొని వివిధ ప్రాంతాల్లోని గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.గాంధీజీ చూపిన సత్యం,అహింస,శాంతి,సామరస్య మార్గాలను స్మరించుకున్నారు.మాజీ కార్పొరేటర్ బసవరాజు శిరీష శ్రీమాన్ ఆధ్వర్యంలో ఇన్నర్ వీల్ క్లబ్ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద వేడుకలు ప్రారంభమయ్యాయి.అనంతరం మాజీ కార్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్ ఆధ్వర్యంలో కాశిబుగ్గ శివాలయం ప్రాంగణంలోని...