కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై INDIA కూటమి ఆగ్రహం
హనుమకొండ, అక్టోబర్ 3: కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాలని, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ INDIA కూటమి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో DCC అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి అధ్యక్షతన సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ వారంలో భాగంగా అక్టోబర్ 5న అంబేద్కర్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. పాదయాత్ర ముగింపులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 326ను చదివి వినిపిస్తామని పేర్కొన్నారు. అక్టోబర్ 6 నుంచి 8 వరకు మండలాలు, పట్టణాలు, డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహించి నిరసన తీర్మానాలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు...